సచిన్ లా నాకు కూడా క్రికెట్ దేవుడని పిలిపించుకోవాలని ఉంది: సెహ్వాగ్

రికార్డులను సాధించడానికే సచిన్ పుట్టాడని... అతని రికార్డులు అమోఘమని మాజీ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ సెహ్వాగ్ కొనియాడాడు. సచిన్ రికార్డులకు తాను కనీసం సమీపంలో కూడా లేనని చెప్పాడు. అందుకే సచిన్ క్రికెట్ గాడ్ గా కొనియాడబడుతున్నాడని తెలిపాడు. ఎవరికైనా దేవుడని పిలిపించుకోవడం ఇష్టంగానే ఉంటుందని... తనకు కూడా గాడ్ అని పిలిపించుకోవాలని ఉందని... అందుకే గతంలో తన పేరును సచిన్ గా మార్చుకుందామని అనుకున్నానని చెప్పాడు. సచిన్ తర్వాత మరో సచిన్ రాడని తాను భావించానని... అయితే తన భావనను కోహ్లీ మార్చేశాడని తెలిపాడు. సచిన్ రికార్డులను కోహ్లీ అధిగమిస్తాడని తాను భావిస్తున్నానని చెప్పాడు. కోహ్లీ రూపంలో ప్రపంచానికి మరో సచిన్ పరిచయం అయ్యాడని తెలిపాడు.
Go Back to Shorts
sachin
kohli
sehwag
team india

More Telugu News